దుబాయ్‌లో ఇల్లు కొనుగోలు చేసిన నటుడు - Mohanlal Buys A Flat At Dubai
close
Published : 20/11/2020 00:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుబాయ్‌లో ఇల్లు కొనుగోలు చేసిన నటుడు

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తాజాగా దుబాయ్‌లో ఓ ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేశారు. దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో డౌన్‌టౌన్‌లోని ఆర్పీ హైట్స్‌లో అన్ని సదుపాయాలతో కూడిన ఓ ఇంటిని ఆయన తీసుకున్నారు. ఈ మేరకు ఆయన బాల్య స్నేహితుడు డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ ఈ ఇంటిని సందర్శించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

గత కొన్నిరోజుల క్రితం ‘దృశ్యం-2’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మోహన్‌లాల్‌ హాలీడేలో భాగంగా ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. ఈ ఏడాది దీవాళి వేడుకలను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కుటుంబసభ్యులతో కలిసి అక్కడే జరుపుకొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని