బరువు తగ్గి షాక్‌ ఇచ్చిన స్టార్‌హీరో కుమార్తె - Mohanlal daughter Vismaya loses 22 kilos shares weightless journey
close
Published : 19/12/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బరువు తగ్గి షాక్‌ ఇచ్చిన స్టార్‌హీరో కుమార్తె

అప్పట్లో మెట్లు ఎక్కితే సరిగ్గా ఊపిరాడేదికాదు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పేరుపొందిన అగ్రకథానాయకుడు, మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ తాజాగా నెటిజన్లను షాక్‌కు గురిచేశారు. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న విస్మయ.. సోషల్‌మీడియా వేదికగా అరుదుగా అభిమానులకు అందుబాటులో ఉండేవారు. అప్పుడప్పుడూ తన ఫొటోలను కూడా షేర్‌ చేసేవారు. చూడడానికి బొద్దుగా కనిపించే విస్మయ.. తాజాగా బరువు తగ్గి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఫిట్‌నెస్‌, మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనర్‌ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకుని ఆమె 22 కిలోల బరువు తగ్గారు. ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఒకప్పటి-ఇప్పటి లుక్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఆమె శిక్షణ చూసి అందరూ ‘వావ్‌ మేడమ్‌.. మీ కష్టానికి ప్రతిఫలం లభించింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘ఫిట్‌కో థాయ్‌లాండ్‌లో గడిపిన ప్రతిక్షణానికి ఇప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నా. ఇక్కడ శిక్షణ ఇచ్చే ప్రతి ఒక్కరూ ఎంతో మంచివారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆరంభంలో అసలు నేను ఏం చేయాలో, చేస్తానో లేదో అనే అంశాలపై నాకు సరైన స్పష్టత లేదు. కొన్నేళ్ల క్రితం కొంచెం ఎక్కువ మెట్లు ఎక్కితేనే ఊపిరాడక ఇబ్బందిపడేదాన్ని. అప్పటి నుంచే బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఇప్పుడు, శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం బాగా నచ్చింది. నా కోచ్‌ సాయం లేకుండా నేనిదంతా సాధించలేను. ట్రైనింగ్‌ విషయంలో ఆయన నాకెంతో సాయం చేశారు. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు.. ఇది నేను చేయలేననే ఆలోచన నాకెన్నోసార్లు వచ్చింది. కానీ ఆయన.. నేను ఏదైనా చేయగలను అనేలా చేశారు. కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఈ శిక్షణ నన్ను ఎన్నో విధాలుగా మార్చింది.’ అని విస్మయ వివరించారు.

ఇవీ చదవండి

ఆమెను చూసి స్ఫూర్తి పొందా: విజయ్‌ దేవరకొండ

రానాతో పనిచేయడం నా అదృష్టం: సాయిపల్లవి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని