ఎవరైనా సరే.. నేను వదలను: సునీల్‌ - Mosagallu Spl Teaser on Sunil Shetty
close
Published : 13/11/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరైనా సరే.. నేను వదలను: సునీల్‌

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆగయా

హైదరాబాద్‌: ‘నా జోన్‌లో ఎవడైనా తప్పుచేస్తే వాడి లైఫ్‌కు డేంజర్‌ జోనే. వాడు ఎంత తోపైనా నేను విడిచిపెట్టను’ అని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

కాగా, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ‘మోసగాళ్లు’ సినిమా నుంచి ఓ స్పెషల్‌ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. సునీల్‌ శెట్టి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ వీడియోని తీర్చిదిద్దారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవదీప్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని