450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌..! - Mosagallu Teaser Out Now
close
Updated : 03/10/2020 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌..!

ఆసక్తికరంగా ‘మోసగాళ్లు’ టీజర్‌

హైదరాబాద్‌: 450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన వాళ్లను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని.. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగంతో ప్రారంభమైన ‘మోసగాళ్లు’ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను శనివారం అల్లు అర్జున్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో విష్ణు, కాజల్‌ మోసగాళ్లుగా కనిపించనున్నట్లు సమాచారం. టీజర్‌లోని ఓ సన్నివేశంలో డబ్బు కట్టలు చూపిస్తూ.. ఇది సరిపోతుందిగా అని కాజల్‌ అడగగా... ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అంటూ విష్ణు చెప్పే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది.

జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అలాగే నవదీప్‌ సైతం ఓ కీలక పాత్రలో నటించనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని