మ్యారేజ్‌ లైఫ్‌ ఓ టెన్షన్‌: అఖిల్‌ - Most Eligible Bachelor Pre Teaser
close
Updated : 19/10/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యారేజ్‌ లైఫ్‌ ఓ టెన్షన్‌: అఖిల్‌

కెరీర్‌ను బాగా సెట్‌ చేసుకున్నానంటోన్న హీరో

హైదరాబాద్‌: ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్‌.. 50 శాతం మ్యారేజ్‌ లైఫ్‌. కెరీర్‌ను సూపర్‌గా సెట్‌ చేశా. కానీ, ఈ మ్యారేజ్‌ లైఫే...’ అని నిట్టూరుస్తున్నారు యువ కథానాయకుడు అఖిల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హర్ష అనే పాత్రలో అఖిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయనకి జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మనసా మనసా’ అనే పాట ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది.

కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ టీజర్‌ను చిత్రబృందం సోషల్ ‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘కెరీర్‌ విషయంలో హర్ష సూపర్‌ హ్యాపీగా ఉన్నారు. కానీ, మ్యారేజ్‌ లైఫ్‌ విషయంలోనే ఆయన ఎంతో టెన్షన్‌గా ఉన్నారు’ అని చిత్ర నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ పేర్కొంది. అంతేకాకుండా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ టీజర్‌ అక్టోబర్‌ 25వ తేదీ ఉదయం 11.40 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని