ఇవి 2020 క్రికెట్‌ సిత్రాలు..  - Most beautiful pics of Team Indian Cricketers in the 2020 year
close
Updated : 22/12/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇవి 2020 క్రికెట్‌ సిత్రాలు.. 

అభిమానులను అలరించిన క్రికెటర్ల పోస్టులు..

చూస్తుండగానే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోయింది. కరోనా వైరస్‌ ప్రభావంతో 2020 ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో కూడా గుర్తులేదు. ఈ ఏడాది ప్రపంచంలో సగం మందికి పైగా సగం జీవితం ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లాగే క్రికెట్‌కు కూడా మంచి విరామం దొరికింది. ఆటగాళ్లు సైతం ఎప్పుడూ ఇలాంటి సమయాన్ని ఆస్వాదించి ఉండకపోవచ్చు. కావాల్సినంత సమయం కుటుంబసభ్యులతో గడిపారు. సరదాగా ఎంజాయ్‌ చేశారు. అయితే, ఈ 2020లో మన టీమ్‌ఇండియా క్రికెటర్లు తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కొన్ని అద్భుతమైన ఫొటోలు అభిమానులను అలరించాయి. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో వారు పంచుకున్న ఫొటోలు, విశేషాలేంటో మీరూ ఒకసారి లుక్కేయండి.

ఈ ఏడాది ఆగస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. జనవరిలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటో బాగా వైరల్‌ అయింది. నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

కోహ్లీ-అనుష్క శుభవార్త..

అర్జున్‌, సారాతో.. సచిన్‌..

ఫాదర్స్‌ డే సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన కుమార్తె, కుమారుడితో గడిపాడు. ఆ రోజు వారితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. యోగా చేస్తూ ముగ్గురూ ఒకే భంగిమలో ఫోజిచ్చారు. ఇది చూడటానికి ఎంతో బాగుంది.

ట్రంప్‌ కోసం సెహ్వాగ్‌ బాబా..

ఈ ఏడాది అమెరికాలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అనేక మంది కన్నుమూశారు. ఆ సమయంలో మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బాబా అవతారమెత్తి ఓ సరదా పోస్టు పెట్టాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పేర్కొంటూ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న తన బాబా ఫొటోను పంచుకున్నాడు.

దీపావళి కాంతుల్లో రోహిత్‌ ఫ్యామిలి..

రోహిత్‌ శర్మ ఈసారి దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకొన్నాడు. ముంబయి కెప్టెన్‌గా రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్ సాధించి తిరిగి భారత్‌కు వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకున్నాడు. ఆరోజు రాత్రి భార్య రితిక, కుమార్తెతో మిరుమిట్లు గొలిపే వెలుగుల్లో తీసుకున్న అందమైన ఫొటో ఇది.

రియోతో రైనా హాలిడే..

ఈ ఏడాది ఆగస్టు 15న సురేశ్‌ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే, మార్చిలో తన సతీమణి ప్రియాంక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిట్టి రైనాకు రియో అనే పేరు పెట్టారు. లాక్‌డౌన్‌ సడలింపులిచ్చాక రైనా విహార యాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా తన కుమారుడితో సముద్రం పక్కన నిల్చొని తీసుకున్న అందమైన మధుర జ్ఞాపకం.

లిటిల్‌ పాండ్యతో హార్దిక్‌ పాండ్య..

టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ హార్దిక్‌ పాండ్య ఈ ఏడాది జనవరి 1న సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌కు ప్రపోజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం లాక్‌డౌన్‌లో వివాహమాడిన వీరు జులైలో లిటిల్‌ పాండ్యకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన కుమారుడితో తొలి ఫొటోను పాండ్య అభిమానులతో పంచుకున్నాడు.

ధనశ్రీతో యుజువేంద్రుడు..

ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ ధనశ్రీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని ట్విటర్‌లో పంచుకొని త్వరలోనే పెళ్లి బాజాలు అనే విషయాన్ని ప్రకటించాడు.

సూర్యుడితో పోటీ పడుతున్న ధావన్‌..

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా మెరవకున్నా ఐపీఎల్‌లో దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో 2 శతకాలు, 4 అర్ధ శతకాలతో మొత్తం 618 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఒక సందర్భంలో సూర్యుడితో పోటీపడీ మరీ ప్రాక్టీస్‌ చేశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యుడి చెంతలో ప్రాక్టీస్‌ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. సూర్యుడు భగభగా మండుతుంటే తాను కూడా లోలోపల రగిలిపోతున్నట్లు పేర్కొన్నాడు. 

బుర్జ్‌ ఖలీఫా ముందు శ్రేయస్‌ యోగా..

అప్పుడప్పుడూ తన మ్యాజిక్‌ ట్రిక్కులతో అందరినీ అలరించే శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి మరో విధంగా ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌ బూర్జ్‌ ఖలీఫా ముందు యోగాసనం చేస్తున్న ఫొటోను ఓ సందర్భంలో తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. బహుశా ఐపీఎల్ జరిగే సమయంలో ఆ ఫొటో తీసి ఉండొచ్చు. రాత్రిపూట లైట్ల వెలుతురుల్లో మెరిసే బూర్జ్‌ ఖలీఫా ముందు శ్రేయస్‌ తీసుకున్న ఫొటో వావ్‌ అనిపిస్తుంది. 


ఇవీ చదవండి..
రహానె నువ్విలా చెయ్‌: గంభీర్‌
ఇండియా చితక్కొడితే ఇండోర్‌ దద్దరిల్లింది.. 
2020.. కోహ్లీ ఏంటి?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని