close

తాజా వార్తలు

Updated : 28/11/2020 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోజును ముంబయి మర్చిపోదు: అక్షయ్‌కుమార్‌

ముంబయి: 2008 నవంబరు 26ను ముంబయివాసులు ఎప్పటికీ మర్చిపోలేరని బాలీవుడ్‌ అగ్రనటుడు అక్షయ్‌కుమార్‌ అన్నారు. ముంబయి మారణహోమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. దేశ వాణిజ్య రాజధానిలో పన్నెండేళ్ల క్రితం  పాక్‌ ఉగ్రవాదులు 10 మంది 12 చోట్ల నరమేధం సృష్టించారు. ఆ మారణహోమంలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వందల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు.  ఈ దుర్ఘటనపై అక్షయ్‌కుమార్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

రాఘవ లారెన్స్‌ తొలిసారిగా బాలీవుడ్‌లో దర్శకత్వం వహించిన ‘లక్ష్మి’ చిత్రంలో అక్షయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆసిఫ్‌, లక్ష్మి పాత్రల్లో అక్షయ్‌ నటన అందరినీ కట్టిపడేసింంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సూర్యవంశీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరో మూడు సినిమాలతో అక్షయ్‌కుమార్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన