కరోనా ‘కలలు’.. లండన్‌ మ్యూజియంలో పదిలం! - Museum of London colleting covid dreams from london people
close
Published : 06/12/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ‘కలలు’.. లండన్‌ మ్యూజియంలో పదిలం!

(ఫొటో: మ్యూజియం ఆఫ్ లండన్‌ ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఒక ఆట ఆడుకుంటోంది. వైరస్‌ దెబ్బకు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కాస్త కుదుటపడ్డా.. ఏప్రిల్‌ - ఆగస్టు నెలల మధ్య ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తి నానా కష్టాలు పడ్డారు. ఇల్లు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి, ఉపాధి.. భవిష్యత్తుపై ఆందోళన.. వెరసి మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఈ క్రమంలో ఎప్పుడూ లేని విధంగా కరోనా కాలంలో ప్రజలకు చిత్రవిచిత్రమైన కలలు వచ్చినట్లు పలు పరిశోధనల్లో తేలింది. కరోనా సంక్షోభం పగటిపూటే కాదు.. రాత్రుళ్లూ మనుషులపై ప్రభావం చూపినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభంలో ప్రజలకు వచ్చిన కలలను సేకరించి సందర్శనకు పెట్టాలని లండన్‌ మ్యూజియం యోచిస్తోంది. ఈ మేరకు ఓ ప్రాజెక్టును చేపట్టింది. కలలను ప్రదర్శనలకు ఎలా పెడతారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవండి..

కరోనా వైరస్‌ అన్ని ప్రాంతాలపై విరుచుకుపడ్డట్టే లండన్‌ నగరంపై కూడా పంజా విసిరింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే, అక్కడి మ్యూజియం ఆఫ్‌ లండన్‌.. కెనడాకు చెందిన మ్యూజియం ఆఫ్‌ డ్రీమ్స్‌తో కలిసి ‘గార్డియన్‌ ఆఫ్‌ స్లీప్‌’ పేరుతో ఒక ప్రాజెక్టు మొదలుపెట్టింది. కరోనా సంక్షోభంలో లండన్‌ వాసులకు వచ్చిన కలలను సేకరించి.. భవిష్యత్తు తరాలకు తెలియజేస్తారట. ఇందులో భాగంగా 2021 జనవరి 15 వరకు లండన్‌వాసులు మ్యూజియంకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. అలా రిజిస్టర్‌‌ చేసుకున్న ప్రజలు.. వారికి వచ్చిన కలలను మ్యూజియం సిబ్బందికి చెప్పాల్సి ఉంటుంది. అలా ప్రజలు చెప్పిన కలలను మ్యూజియం సిబ్బంది రికార్డు చేసి.. డాక్యుమెంటరీ రూపొందిస్తారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు వచ్చిన కలల్ని మౌఖిక రూపంలో సాక్ష్యాలుగా మలచడం, వారి మానసిక స్థితి, కలలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని మ్యూజియం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విధంగా ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారని పేర్కొంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని