close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120043493 [video_srlno] => 1 [video_type] => 5 [video_link] => B-Yn7xMn-Zt [video_short_link] => B-Yn7xMn-Zt [created_by] => 1017782 [created_date] => 2020-03-31 18:13:35.242455 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

కృష్ణ తొలి చిత్రానికి55 ఏళ్లు.. మహేశ్‌ కామెంట్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ తొలి సినిమా ‘తేనె మనసులు’. అరంగేట్రంతోనే హిట్‌ అందుకున్న ఆయన ఆపై అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ‘తేనె మనసులు’ విడుదలై మంగళవారానికి 55 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన తండ్రి చిత్రాన్ని మహేశ్‌బాబు సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయని, ఇది టైమ్‌లెస్‌ క్లాసిక్‌ అని అన్నారు. ‘నా ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ ‘తేనె మనసులు’’ అని కామెంట్‌ చేశారు. దీంతోపాటు సినిమాకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ‘నాన్న పట్ల ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటా. ఇది ఎంతో ఉత్తమమైన చిత్రం. ఇది కాలంతో సంబంధంలేని ఓ క్లాసిక్‌. ఈ ఉదయం మనల్ని పాత జ్ఞాపకాల్లోకి నెట్టేసింది’ అని మహేశ్‌ పోస్ట్‌కు ఆయన సోదరి మంజుల కామెంట్‌ ఇచ్చారు.

కృష్ణ, రామ మోహన్‌, సంధ్యారాణి, సుకన్య కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘తేనె మనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. సి. సుందరం నిర్మించిన ఈ సినిమా 1965 మార్చి 31 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విజయం సాధించడంతో కృష్ణకు వరుస అవకాశాలు లభించాయి. అలా మొదలైన ఆయన ప్రస్థానం 300 సినిమాలకుపైగా సాగింది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.