సాగర తీరాన రష్మిక కసరత్తులు - My first beach workout rashmika shared video
close
Updated : 30/09/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 సాగర తీరాన రష్మిక కసరత్తులు

కష్టంగా ఉన్నా.. ఇష్టంగా మారిందట..

హైదరాబాద్‌: అందం, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక. సాధారణంగా సెలబ్రిటీలు జిమ్‌, ఇళ్లలో కసరత్తులు చేస్తుంటారు. లేకపోతే పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. నటి రష్మిక సముద్రం ఒడ్డుకు జిమ్‌ పరికరాలు ఎత్తుకెళ్లి.. అక్కడ వర్కౌట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోల్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ.. అనుభూతిని తెలిపారు. ‘నా మొదటి బీచ్‌ వర్కౌట్‌.. నిజంగా చెబుతున్నా చాలా అలసిపోయా, కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు సముద్రం ఒడ్డున వ్యాయామం చేయడానికి అలవాటు పడిపోయా. అలల శబ్దం.. సముద్రం సువాసన.. సూర్యోదయాన్ని చూడటం.. నా కాళ్ల కింద ఇసుక.. ఇదంతా చాలా అందంగా ఉంటుంది..’ అని రష్మిక అన్నారు. ఫాలోవర్స్‌ కోరిక మేరకు వీడియోను షేర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

రష్మిక ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. తన మనసు బాలేనప్పుడు ఎక్కువగా కసరత్తులు చేస్తుంటానని ఓ సందర్భంలో అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆమె గత కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల కోసం ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం చేసి.. వీడియో షేర్‌ చేశారు. రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా హిట్‌ అందుకుంది. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దొంగతనం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులోని పాత్రల కోసం బన్నీ, రష్మిక చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్లు తెలిసింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని