close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/06/2020 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రస్ట్‌లోని పిల్లలందరూ కోలుకున్నారు..!

రాఘవ లారెన్స్‌ ట్వీట్‌

చెన్నై: తన ట్రస్ట్‌కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని ప్రముఖ నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెలిపారు. లారెన్స్‌ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు. ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు.

‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్‌ చేశారు. పిల్లలందరూ ట్రస్ట్‌కి వచ్చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు. పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అని లారెన్స్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.