close

తాజా వార్తలు

‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’

సహజీవన భాగస్వామిపై మలయాళి నటి ఆరోపణలు

చెన్నై: అంజలి అమీర్‌.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడి నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెను వేధింపులకు గురించేస్తున్నాడని వివరించారు.

అంజలి అమీర్‌ గతకొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని అంజలి ఇటీవల ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా అభిమానులకు తెలిపారు. ‘ఆ వ్యక్తి నన్ను మోసం చేసి సహజీవనం చేసేలా చేశాడు. అతను మంచివాడు కాదని తెలిసింది. వెంటనే అతన్ని వదిలేయాలనుకున్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నా మీద యాసిడ్‌ దాడి చేస్తానని అంటున్నాడు. నేను కొంతకాలంగా నా బ్యాంకు ఖాతాలో రూ.4లక్షలను పొదుపు చేసుకున్నాను. రెండు సంవత్సరాల నుంచి అతను ఆ డబ్బును కూడా వాడేసుకున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది.’ అని అంజలి తెలిపారు.

తన జీవితాన్నే ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్లు అంజలి ఇటీవల ప్రకటించారు. ఆమె ఏవిధంగా నటిగా మారింది. ఆమె ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈసినిమా ప్రారంభం కావాల్సి ఉంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.