close
Array ( ) 1

తాజా వార్తలు

సల్మాన్‌తో రిలేషన్‌ దెబ్బతింది: బోనీకపూర్‌

అర్జున్‌ను మొదట ప్రోత్సహించింది అతనే

ముంబయి: ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల సల్మాన్‌కు తనకు మధ్య రిలేషన్‌ దెబ్బతిందని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ అన్నారు. అయితే నటుడికి కావాల్సిన లక్షణాలు అర్జున్‌ కపూర్‌లో ఉన్నాయని చెప్పి, అతన్ని ప్రోత్సహించింది కూడా సల్మాన్‌ఖానే అని బోనీకపూర్‌ పేర్కొన్నారు. ఇటీవల బోనీకపూర్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన మీరు.. వారిపై ఉన్న ప్రేమను ఎందుకని బయటకు చెప్పరు? నలుగురు పిల్లల్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని ప్రశ్నించగా.. ‘ఒక తండ్రిగా నలుగురు పిల్లలంటే నాకెంతో ఇష్టం. కాకపోతే ఖుషీ అంటే చాలా ఎక్కువ ఇష్టం. తను చిన్నపిల్ల. నా గుండెల్లో తనకి పత్ర్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉంటుంది. అర్జున్‌ నా హృదయం. పిల్లల మీద ఉన్న ప్రేమను నేను ఎక్కువగా బయటకు చెప్పను. ఎందుకంటే ఒక తండ్రిగా వాళ్లని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. అన్షులా చాలా తెలివైంది. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యూయేట్‌ పొందింది. తనని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది. మొదట తనకి అమెరికాలోని గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది. ముంబయికి రమ్మని మేము అడిగేవాళ్లం. ఆ తర్వాత కొంతకాలానికే తన వర్క్‌ నచ్చి కంపెనీ వాళ్లే ముంబయి ఆఫీస్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ సమయం నాకెంతో గర్వంగా అనిపించింది.’ అని బోనీ తెలిపారు.

జాన్వీ నటన గురించి విమర్శకుల అభిప్రాయంపై బోనీ స్పందిస్తూ.. ‘శ్రీదేవి స్థాయి నటనను మొదటి సినిమాకే జాన్వీకపూర్‌ నుంచి ఆశించడం చాలా తప్పు. శ్రీదేవి మరణించిన సమయంలో జాన్వీ బాధని దాచుకుని వెళ్లి షూటింగ్‌లో పాల్గొంది. సినిమా పూర్తి చేయడానికి తను ఎంతో కష్టపడింది’ అని పేర్కొన్నారు.

అర్జున్‌ కపూర్‌ను నటుడిగా మీరే ఎందుకు పరిచయం చేయలేదు?అని ప్రశ్నించగా.. ‘‘అర్జున్‌కి దర్శకుడు కావాలనే ఆలోచన ఉండేది. అందుకే నేను అర్జున్‌ని నటుడిగా పరిచయం చేయాలనుకోలేదు. కానీ ఒకరోజు సల్మాన్‌ నాకు ఫోన్‌ చేసి.. ‘నటుడికి కావాల్సిన లక్షణాలు అర్జున్‌లో ఉన్నాయి. అతన్ని నటుడిగా పరిచయం చేస్తే బాగుంటుంది.’ అని చెప్పారు. అర్జున్‌ నటుడిగా ఎదిగేందుకు సల్మాన్‌ బీజం వేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల నాకు, సల్మాన్‌కు మధ్య ఉన్న బంధం ఇప్పుడు దెబ్బతింది. కానీ నటనపరంగా అర్జున్‌ను ప్రోత్సహించింది మాత్రం సల్మాన్‌ఖానే.’ అని బోనీకపూర్‌ చెప్పారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.