ఓ రోజు ట్రాన్స్‌జండర్లు నన్ను కలిశారు: లారెన్స్‌ - My special thanks to Akshay sir for accepting Laxmmi Bomb says Raghava Lawrence
close
Published : 18/10/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ రోజు ట్రాన్స్‌జండర్లు నన్ను కలిశారు: లారెన్స్‌

అలా ‘లక్ష్మీ బాంబ్‌’ ఆలోచన..

ముంబయి: అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్‌’ సినిమాలోని పాత్రకు సంతకం చేయడం గొప్ప విషయమని దర్శకుడు రాఘవా లారెన్స్‌ అన్నారు. బాలీవుడ్‌ ఖిలాడీ కథానాయకుడిగా నటించిన సినిమా ‘లక్ష్మీ బాంబ్‌’. తమిళ్‌లో తీసిన ‘ముని 2: కాంచన’కు హిందీ రీమేక్‌ ఇది. రాఘవా లారెన్స్‌ దర్శకత్వం వహించారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఓటీటీ వేదికగా నవంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా లారెన్స్‌ చిత్రం గురించి మీడియాతో ముచ్చటించారు. తన సహాయం కోసం వచ్చిన ట్రాన్స్‌జండర్ల కథలు విన్న తర్వాత ‘కాంచన’ సినిమా తీయాలనే ఆలోచన వచ్చినట్లు వివరించారు.

‘తమిళ్‌లో ఈ చిత్రం ‘కాంచన’గా విడుదలైంది. ‘కాంచన’ అంటే బంగారం అని అర్థం. లక్ష్మికి మరో రూపం. కాబట్టి ‘లక్ష్మి’ అనే టైటిల్‌ పెట్టాలని అనుకున్నా. దానికి తోడు సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అందరం కలిసి ‘లక్ష్మీ బాంబ్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించాం. హిందీ ఆడియన్స్‌కు చేరువ కావడానికి ఇది మంచి టైటిల్‌. ఇందులో ట్రాన్స్‌జండర్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అదే ఈ సినిమాలో ప్రధానం. ‘లక్ష్మీ బాంబ్‌’ ప్రేక్షకులకు థ్రిల్‌తోపాటు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. హారర్‌-కామెడీ నేపథ్యం ఉన్న ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. స్క్రీన్‌పై ఒకే పాత్రలోని విభిన్న కోణాల్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు’.

‘నేను ఓ ట్రస్ట్‌ నడుపుతున్నా. కొన్నేళ్ల క్రితం కొందరు ట్రాన్స్‌జండర్లు సాయం కోసం నన్ను కలిశారు. ఆ సమయంలో వారి జీవితం గురించి తెలుసుకున్న తర్వాత.. వారి కథను ‘కాంచన’ అనే పాత్రతో అందరికీ తెలియజేయాలి అనుకున్నా. ‘లక్ష్మీ బాంబ్‌’ సినిమా చూసిన తర్వాత హిందీ ప్రేక్షకులకు ఆ విషయం అర్థమౌతుంది’

‘‘కాంచన’ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత విశేషమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి ట్రాన్స్‌జండర్లు ఎంతో ప్రశంసించారు. నేరుగా నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. హిందీలో అలాంటి పాత్రలో అక్షయ్‌ కుమార్‌ సర్‌ నటిస్తే.. ఈ సందేశం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరుతుందని భావించా. ఈ చిత్రానికి అంగీకరించి, నటించినందుకు అక్షయ్‌ సర్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’ అని లారెన్స్‌ పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని