బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్‌ చూశారా? - NBK Narthanasala Official Trailer
close
Updated : 06/07/2021 17:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. కొంతమేర షూటింగ్‌ జరుపుకొన్న ఈ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. తాజాగా విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఇక ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబులను స్క్రీన్‌పై చూస్తుంటే కనుల విందుగా ఉంది. సౌందర్య, శ్రీహరి అభిమానులు  వారిని చూసి ఆనందపడుతున్నారు. ఇక విజయదశమి సందర్భంగా అక్టోబరు 24న శ్రేయాస్‌ ఈటీ వేదికగా ఉదయం 11.49గంటలకు 17నిమిషాల వీడియోను వీక్షించవచ్చు. అప్పటివరకూ ఈ అరుదైన దృశ్యాలను మీరూ చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని