కపిల్‌దేవ్‌ వల్లే అలా మారాను: ద్రవిడ్‌ - NCA head Rahul Dravid reveals how Kapildev helped him moulding his career as coach
close
Published : 18/07/2020 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కపిల్‌దేవ్‌ వల్లే అలా మారాను: ద్రవిడ్‌

డబ్ల్యూవీ రామన్‌తో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ది వాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాడిగా కెరీర్‌ ముగిసిన అనంతరం ఏం చేయాలనే విషయంపై మాజీ సారథి కపిల్‌ దేవ్‌ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. భారత మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటించిన ద్రవిడ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘క్రికెటర్‌గా నా కెరీర్‌ ముగిసిన అనంతరం ఏం చేయాలో తొలుత పాలుపోలేదు. అప్పుడే కపిల్‌ దేవ్‌ ఒక మంచి విషయం చెప్పాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కొన్నేళ్లు ఏదో ఒక పనిచేస్తూ నీకు ఏం నచ్చుతుందో దాని మీద ధ్యాసపెట్టమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు. 

ఇక తన కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికే తాను రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌, కోచ్‌ బాధ్యతల్లో కొనసాగుతున్నానని, అదృష్టవశాత్తూ అలా కోచింగ్‌ కెరీర్‌ కొనసాగిందని స్పష్టంచేశాడు. అలాగే 1998లో తనను వన్డే జట్టు నుంచి తప్పించారని, స్ట్రైక్‌రేట్‌ కారణంగా అలా చేయడంతో ఇక తాను ఈ ఫార్మాట్‌లో ఆడలేమోననే అభద్రతా భావం ఏర్పడిందన్నాడు. ఏడాది పాటు వన్డేల్లో ఆడలేదని ద్రవిడ్‌ చెప్పాడు. సహజంగా తాను టెస్టు క్రికెటర్‌ అని, తనకు కోచింగ్‌ కూడా టెస్టు క్రికెటర్‌లాగే సాగిందన్నాడు. ఒకవేళ తన కెరీర్‌ సాఫీగా సాగకపోయుంటే ఎంబీఏ చేసేవాడినని చెప్పాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని