డ్రగ్స్‌ కేసు.. దీపిక, రకుల్‌కు ఎన్సీబీ సమన్లు - NCB Issued Summons to Actress Dipika Padukone and RakulPreet
close
Updated : 24/09/2020 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ కేసు.. దీపిక, రకుల్‌కు ఎన్సీబీ సమన్లు

శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌కు కూడా..

ముంబయి: మాదకద్రవ్యాల వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) అధికారుల దర్యాప్తులో కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరికొందరు బాలీవుడ్‌ తారలకు ఎన్‌న్సీబీ సమన్లు జారీ చేసింది. బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. వీరితో పాటు దీపికా మేనేజర్‌ కరిష్మ, సుశాంత్‌ మేనేజర్‌ శృతి మోదీని కూడా విచారణకు పిలిచారు. 

గురువారం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హాజరు కావాలని పేర్కొన్న అధికారులు.. శుక్రవారం (ఈనెల‌ 25న) దీపికా పదుకొణె,  శనివారం (26న) సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌ హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు, దీపిక తన తదుపరి చిత్రం షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు సమాచారం.

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో దీపికా పదుకొణే మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌తో పాటు టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాను కూడా ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్‌ గురించి జరిగిన చాటింగ్‌ వివరాలను అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు కొన్ని రోజుల పాటు విచారించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు ఇప్పటివరకు డ్రగ్స్‌ కేసులో 15మందిని అరెస్టు చేశారు. రియా చక్రవర్తిని విచారించిన సందర్భంలోనే సారా అలీఖాన్‌, రకుల్‌ పేర్లు బయటకు వచ్చాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని