‘కరణ్‌ సెలబ్రిటీలకు డ్రగ్స్‌ పార్టీ ఇచ్చాడు’ - NCB probes viral celeb video from Karan Johars party
close
Published : 18/09/2020 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కరణ్‌ సెలబ్రిటీలకు డ్రగ్స్‌ పార్టీ ఇచ్చాడు’

ఎస్‌ఏడీ నాయకుడి ఫిర్యాదు.. రంగంలోకి ఎన్‌సీబీ?

ముంబయి: 2019 జులైలో బాలీవుడ్‌ స్టార్స్‌ కోసం ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో కరణ్‌ తన ఇంట్లో ప్రముఖులకు పార్టీ ఇచ్చి, వీడియోను షేర్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఇది బంధుప్రీతిని తెలుపుతోందని విమర్శించారు. ఆ తర్వాత వీడియోలో నటీనటుల తీరు చూసి.. ‘ఇది డ్రగ్స్‌ పార్టీ’ అని ఆరోపించారు. పలువురు రాజకీయ నాయకులు కూడా దీన్ని తప్పుపట్టారు. అప్పట్లో వీడియో తెగ వైరల్‌ అయ్యింది. తాము డ్రగ్స్‌ తీసుకోలేదని అందులోని స్టార్స్‌ వివరించారు. అలాంటి తప్పు జరిగి ఉంటే ఆ వీడియో ఎందుకు పోస్ట్‌ చేస్తానని కరణ్‌ మీడియాతో అన్నారు.

కాగా వారం క్రితం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నాయకుడు మన్‌జిందర్‌ సింగ్‌ బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహార్‌, దీపికా పదుకొణె, మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌, షాహిద్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, వరుణ్‌ ధావన్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. ‘పార్టీకి వెళ్లిన వారు డ్రగ్స్‌ తీసుకున్నారు’ అని ఫిర్యాదులో ఆరోపించారు. కేసు పెట్టినట్లు తెలుపుతూ వివరాలు ట్వీట్‌ చేశారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశానని, విచారణ చేపట్టమని కోరానని అన్నారు. అంతేకాదు కరణ్‌ షేర్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో అసలైందా?, లేక నకిలీదా? అని తెలుసుకునే పనిలోపడ్డట్లు పలు ఆంగ్ల వెబ్‌సైట్లు రాశాయి. ఒకవేళ వీడియో నిజమైందయితే.. విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తున్న తరుణంలో డ్రగ్స్‌ వాడకం గురించి బయటపడింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు విచారణ చేపట్టారు. డ్రగ్స్‌ వాడకం, సరఫరా అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని