దీపిక కోస్టార్స్‌కు సమన్లు.. అవాస్తవం..! - NCB rubbishes reports of DNCB rubbishes reports of Deepika Padukones costars A R and S being summoned
close
Updated : 01/10/2020 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపిక కోస్టార్స్‌కు సమన్లు.. అవాస్తవం..!

ఆ హీరోయిన్స్‌కి క్లీన్‌చిట్‌..?

ముంబయి: మాదకద్రవ్యాల వాడకం కేసు ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రసీమను కుదిపేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా హీరోయిన్లు‌ దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ ఇటీవల ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సదరు నాయికల సెల్‌ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీపికతో కలిసి నటించిన ఓ ముగ్గురు హీరోలకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్లు కొన్నిరోజుల నుంచి పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఆ కథానాయకుల పేర్లలోని మొదటి అక్షరాలు ‘ఏ’, ‘ఎస్‌’, ‘ఆర్‌’ అని పేర్కొంటూ ఇవి ప్రచూరితమయ్యాయి. కాగా, సదరు వార్తలపై ఎన్సీబీ అధికారి స్పందించారు. ఆ కథనాలు అవాస్తవమని తెలిపారు. ‘కొన్ని మీడియా ఛానెళ్లు ప్రసారం చేస్తోన్న అసత్యపు కథనాలపై నన్ను స్పందించమని కోరుతున్నారా? అవన్నీ అవాస్తవ కథనాలు’ అని స్పష్టత ఇచ్చారు.

హీరోయిన్లకు క్లీన్‌చిట్‌..!

ఇటీవల మృతి చెందిన నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహాని విచారించగా.. ఆమె సెల్‌ఫోన్‌ నుంచి బయటపడిన పలు వాట్సాప్‌ సంభాషణలను ఆధారంగా చేసుకుని దీపిక, ఆమె మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌, సారా, శ్రద్ధాకపూర్లకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు 25, 26 తేదీల్లో విచారణలో పాల్గొన్న నటీమణులు తాము మాదకద్రవ్యాలను వినియోగించలేదని అధికారులకు వెల్లడించినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలోని విచారణలో పాల్గొన్న హీరోయిన్లకి అధికారులు క్లీన్‌చిట్‌ ఇవ్వనున్నారని కొన్ని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తోన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని