డ్రగ్స్‌ కేసులో దీపికకు సమన్లు? - NCB to summon Deepika Padukone
close
Updated : 22/09/2020 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ కేసులో దీపికకు సమన్లు?

ముంబయి: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. దీనిలో డ్రగ్స్‌ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు కూడా మాదక ద్రవ్యాల వినియోగం కేసులో ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాకుండా శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ అవుతాయని తెలుస్తోంది.

 

రిపీట్‌ ఆప్టర్‌ మీ..

ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌, ‘‘రిపీట్‌ ఆఫ్టర్‌ మీ, కుంగుబాటు డ్రగ్స్‌ వాడకం వల్ల సంభవించే ఫలితం. హై సొసైటీకి చెందిన ధనవంతులైన స్టార్‌ కిడ్స్.. తమను తాము హుందాతో కూడిన వ్యక్తులుగా, మంచి పెంపకంలో పెరిగిన వారిగా అభివర్ణించుకుంటారు. అయితే వీరు తమ మేనేజర్‌ని ‘మాల్‌ హై క్యా..’ అని అడుగుతారు’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘రిపీట్‌ ఆప్టర్‌ మీ..’’ అంటూ దీపిక గతంలో డిప్రెషన్‌ (కుంగుబాటు) గురించి సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనితో కంగన పోస్టు దీపికాతో సహా శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లను ఉద్దేశించి చేసినట్లు తెలుస్తోంది.

అసలు సినీ పరిశ్రమలోకి నిషేధిత డ్రగ్స్‌ ఎలా, ఎక్కడ నుంచి వస్తున్నాయో కనిపెట్టే పనిని ఎన్సీబీ ముమ్మరం చేసింది. పాక్‌, పంజాబ్‌ తదితర ప్రాంతాల నుంచి దేశ ఆర్థిక రాజధానిలోకి ప్రవేశించడంపై ఆరా తీస్తోంది. డ్రగ్స్‌ కేసులో ప్రస్తావనకు వచ్చిన డి, కె అనే ఆంగ్ల అక్షరాల్లో డి అంటే దీపికా పదుకొణె అని, కె అంటే ఆమె మేనేజర్‌ కరిష్మా అని భావిస్తున్నారు. కాగా వీరిని ఈ రోజు ప్రశ్నిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని