close

తాజా వార్తలు

Published : 05/12/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫొటోగ్రాఫర్‌ను ఆటపట్టించిన ఎన్టీఆర్‌

వీడియో వైరల్‌

హైదరాబాద్‌: కథానాయకుడు ఎన్టీఆర్‌ తన హాస్య చతురతతో మరోసారి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన నటిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మహాబలేశ్వర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రాజమౌళి, ఎన్టీఆర్‌తోపాటు చిత్ర బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో విమానాశ్రయంలో తీసిన వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్‌ తారక్‌ చిత్రాలు గ్యాప్‌ లేకుండా క్లిక్‌ మనిపించారు. దీన్ని గమనించిన యంగ్‌టైగర్‌ ఆయనతో సంభాషించారు. ‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ అని జోక్‌ చేశారు. దీనికి అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్‌తోపాటు అందరూ నవ్వారు. అంతేకాదు తారక్‌ కారువైపునకు నడుస్తూ.. ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి మాట్లాడారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడేనా? అన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కొమరం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్‌, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ చిత్రం 50 రోజుల హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన