రెమ్యూనరేషన్‌ వద్దన్న ఎన్టీఆర్‌..! - NTR signed for a talkshow without remunaration
close
Published : 17/12/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెమ్యూనరేషన్‌ వద్దన్న ఎన్టీఆర్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు ‘యంగ్‌ యముడు’ ఎన్టీఆర్‌. ఓ తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ ఛానల్‌ త్వరలోనే ప్రసారం చేయబోయే టాక్‌షోలో తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడట. గతంలో ఎన్టీఆర్‌ ఓ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. మరోసారి మైక్‌ పట్టుకోబోతున్న ఎన్టీఆర్‌ ఈసారి ఎలాంటి రెమ్యూనరేషన్‌ తీసుకోవడం లేదట. అదేంటీ.. టాలీవుడ్‌లో ఎంతో డిమాండ్‌ ఉన్న తారక్‌ రెమ్యూనరేషన్‌ లేకుండా పనిచేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అవును, ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌ తీసుకోవడం లేదట. కాకపోతే.. తానే స్వయంగా డబ్బు పెట్టి నిర్మాత అవతారం ఎత్తనున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు తారక్‌. అందులో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తవగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అయితే.. ఈరెండు సినిమాలకు మధ్య దొరికిన ఖాళీ సమయాన్ని టాక్‌షోకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

ఫొటోగ్రాఫర్‌ను ఆటపట్టించిన ఎన్టీఆర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని