‘ఆచార్య’, ‘పుష్ప’ టీమ్‌లకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఛాలెంజ్‌ - Nabha Natesh And Rakul Preet Singh Accepts The Green India Challenge
close
Updated : 11/11/2020 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’, ‘పుష్ప’ టీమ్‌లకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఛాలెంజ్‌

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’, సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లలో రానున్న ‘పుష్ప’ చిత్రబృందాలకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఛాలెంజ్‌ విసిరింది. ప్రభాస్‌ ఛాలెంజ్‌ చేయడంతో ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ను స్వీకరించిన రామ్‌చరణ్‌ ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందాన్ని ఈ ఛాలెంజ్‌ కోసం నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ బుధవారం ఉదయం తాజాగా మొక్కలు నాటింది. దానికి సంబంధించిన వీడియోని నెట్టింట్లో పోస్ట్‌ చేసింది. ‘మా రామరాజు రామ్‌చరణ్‌ వేసిన ఛాలెంజ్‌ను మేము స్వీకరించి.. మొక్కలు నాటాం. ఈ ఛాలెంజ్‌కు కొనసాగింపుగా ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్‌’, ‘పుష్ప’ చిత్రబృందాలను నామినేట్‌ చేస్తున్నాం.’ అని పేర్కొంది.

చైతన్య ఛాలెంజ్‌.. రకుల్‌ కంప్లిట్‌

యువ కథానాయకుడు నాగచైతన్య విసిరిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ను నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో రకుల్‌ మొక్కలు నాటారు. ‘గ్రీన్ఇండియా ఛాలెంజ్’ ఒకరిద్దరిది కాదని.. మనమంతా కలిసి చేయాల్సిన కార్యక్రమం అని ఆమె తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్న  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

బెల్లకొండ శ్రీనివాస్‌ను నామినేట్‌ చేసిన నభానటేశ్

మరోవైపు నటి నభానటేశ్‌ తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం మూడు మొక్కలు నాటారు. అనంతరం ఇలాంటి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’కు కొనసాగింపుగా బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌, నిధి అగర్వాల్‌ను నామినేట్‌ చేశారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని