
తాజా వార్తలు
హీరాబెన్ మోదీ గొప్ప మహిళ: నాగబాబు
హైదరాబాద్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదని నటుడు నాగబాబు అన్నారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆయన గత కొన్నిరోజులుగా ‘పేరెంటల్ స్కిల్స్’ అంశంపై మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన వీడియోలో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు.
‘‘తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల్ని నిరుత్సాహపరచకూడదు. వాళ్లు చేసేది చిన్న పనైనా ప్రోత్సహించాలి. మనం అలా చేస్తే భవిష్యత్తులో వాళ్లు ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఒకవేళ పిల్లలు చేసే ప్రతి పనినీ తల్లిదండ్రులు నిరుత్సాహపరిస్తే.. కొన్నిసార్లు వాళ్లు ఏ పనీ చేయడానికి ఆసక్తి చూపరు. ‘అమ్మవాళ్లు ఎప్పుడూ మనల్ని ప్రోత్సహించరు’ అనే భావన వాళ్లలో కలుగుతుంది’’
‘‘నా పిల్లల విషయానికి వస్తే.. నిహారిక చిన్న పని చేసినా సరే.. ‘బాగా చేశావమ్మ’ అంటాను. నాకు తెలుసు అది చిన్నపనే అని. కానీ, తనని నిరుత్సాహపరచడం నాకిష్టం లేదు. అలాగే, తను ఏదైనా ఆలోచనతో నా దగ్గరకి వస్తే.. ‘ఓకే అమ్మ.. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు’ అని చెప్పేవాడిని. నా మనసులో ఎక్కడో ఒక చోట ఎలా చేస్తుందో? ఏం సాధిస్తుందో? అనే అపనమ్మకం ఉన్నప్పటికీ దాన్ని పిల్లలపై రుద్దేవాడిని కాదు’’
‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. వరుణ్ తేజ్ హీరో అవుతానన్నప్పుడు.. ‘ఓకే బాబు. ఏదైనా సరే.. గట్టి నమ్మకంతో ప్రయత్నించు’ అని చెప్పా. నిజం చెప్పాలంటే, వరుణ్బాబుని హీరో చేయాలనుకోలేదు. ఓ పోలీస్‌గా చూడాలనుకున్నా. అలాగే నిహారికను డాక్టర్ చేయాలనుకున్నా. అది కేవలం నా కోరిక మాత్రమే. నా అభిప్రాయాన్ని ఏ రోజూ పిల్లలపై రుద్దలేదు. నిహారిక, వరుణ్ బాబు ఎప్పుడూ నా మాటకు గౌరవమిస్తారు. ఏం చెప్పినా వింటారు. అలాగే, నేనూ వాళ్ల మాటలను గౌరవిస్తాను. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అలానే పెంచారు’’
‘‘ఇప్పుడు మనందరం చెప్పుకునే పోరాటయోధులందర్నీ.. వారి తల్లిదండ్రులు గొప్పగా పెంచారనేది నా భావన. ప్రస్తుతం మనందరం చూసుకుంటే.. ఓ టీ కొట్టులో పనిచేసిన నరేంద్రమోదీ గారు దేశ ప్రధాని అయ్యారు. ఇప్పటికీ ఆయన.. తన తల్లిని(హీరాబెన్) కలిసి వస్తుంటారు. ఆమెకి ఇలాంటి పేరెంటల్ స్కిల్స్‌పై ఎలాంటి ఆలోచన ఉందనేది నాకు తెలియదు. కానీ, కొడుకుని ఓ అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆమెది’’ అని నాగబాబు వివరించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
