‘వైల్డ్‌డాగ్‌’: నాగ్ ఆపరేషన్ పూర్తయ్యింది! - Nagarjuna completed his part in wild dog
close
Updated : 06/11/2020 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైల్డ్‌డాగ్‌’: నాగ్ ఆపరేషన్ పూర్తయ్యింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున కీలక పాత్రలో అహిషోర్‌ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌డాగ్‌’. ఉత్కంఠభరిత కథా కథనాలతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ తాజాగా హిమాలయాల్లోని రోహ్‌తంగ్‌లో జరిగింది.  ‘వైల్డ్‌డాగ్‌’లో తాను నటించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని నాగార్జున తెలిపారు. ‘వైల్డ్‌డాగ్‌’లో నా పని పూర్తవడంతో ఇంటికి వెళుతున్నా. ప్రతిభగల నా టీం, హిమాలయాలకు వీడ్కోలు చెప్పడం బాధగా ఉంది'' అని ట్వీట్ చేశారు.

ఇందులో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టుపెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం చూడాల్సిందే.. ఇందులో నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని