స్టూడియోలో అగ్ని ప్రమాదంపై నాగ్‌ ట్వీట్‌ - Nagarjuna denies major fire accident at Annapurna Studios
close
Published : 17/10/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టూడియోలో అగ్ని ప్రమాదంపై నాగ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందన్న వార్తలు అవాస్తవమని కథానాయకుడు, నిర్మాత నాగార్జున స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అనేక వార్తలు ప్రచారమయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు దట్టమైన పొగతో కూడిన వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సోషల్‌మీడియాలో స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆ వార్తలు అవాస్తవం. అంతా సాధారణంగా, సురక్షితంగానే ఉంది’ అని నాగ్‌ ట్వీట్‌ చేశారు.

తెలుగులో ‘మన్మథుడు 2’ (2019) తర్వాత నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఏసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున కనిపించనున్నారు. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకుడు. దియా మీర్జా, సయ్యామీ ఖేర్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్టు ‘బ్రహ్మాస్త్ర’లో నాగ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని