నేను సంతోషంగా లేను.. అందుకే చంపేస్తున్నా.. - Nagpur Doctor Suicides After Killing Husband Children
close
Published : 20/08/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను సంతోషంగా లేను.. అందుకే చంపేస్తున్నా..

భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కి చెందిన ఓ వైద్యురాలు తన భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. జీవితంలో సంతోషంగా లేనందువల్లనే ఇలా చేస్తున్నట్లు ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పోలీసుల వివరాల ప్రకారం.. వైద్యురాలు సుష్మ రాణె, ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే ఆమె భర్త ధీరజ్‌(42), ఇద్దరు పిల్లలు (11, 5 ఏళ్లు) కొరాడి ప్రాంతంలో నివసించేవారు. వారితోపాటే వేరే గదిలో ఉంటున్న వైద్యురాలి అత్త బెడ్‌రూమ్‌లో ఉన్న వారిని ఎంత పిలిచినా సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె విషయం పోలీసులకు తెలిపింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టగా వారంతా బెడ్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉన్నారు. ధీరజ్‌తోపాటు పిల్లల మృతదేహాలు బెడ్‌మీద పడి ఉండగా, వైద్యురాలి మృతదేహం సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనాస్థలంలో రెండు సిరింజీలతోపాటు ఓ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన జీవితం ఆనందంగా లేనందువల్లే ఇలా చేస్తున్నట్లు సుష్మ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. మొదట విషంతో కూడిన ఆహారాన్ని భర్త, పిల్లలకు తినిపించి, అనంతరం గుర్తు తెలియని ఇంజక్షన్‌ ఇచ్చి వారిని హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని