నయన్‌ టీమ్‌ ఆగ్రహం - Nayan Team On Rani Velu Nachiyar Biopic
close
Updated : 30/12/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయన్‌ టీమ్‌ ఆగ్రహం

డౌట్‌ ఉంటే మెసేజ్‌‌ లేదా కాల్‌ చేయండి..!

చెన్నై: గ్లామర్‌, ఆధ్యాత్మికం, చారిత్రాత్మకం.. ఇలా పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయప్రవేశం చేసి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని అగ్రకథానాయికగా రాణిస్తున్నారు నయనతార. ఇటీవల ‘మూకుత్తి అమ్మన్‌’గా ప్రేక్షకులను మెప్పించిన ఆమె‌ త్వరలో ఓ పవర్‌ఫుల్‌ బయోపిక్‌లో నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా సదరు వార్తలపై నయన్‌ టీమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ అవాస్తమని కొట్టిపారేసింది.

‘ప్రముఖ పోరాటయోధురాలు రాణి వేలు నచియర్ (VELU Nachiyar) జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న బయోపిక్‌లో నయన్‌ నటించనున్నారంటూ గత కొన్నిరోజులుగా పలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవి పూర్తి అవాస్తవం. నయన్‌ తరఫు మేము ఆ వార్తలను ఖండిస్తున్నాం. అలాంటి వార్తలను ప్రచురించేటప్పుడు ఒక్కసారి నిజానిజాలు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మెయిల్‌, ఫోన్‌కాల్‌, మెస్సేజ్‌ ద్వారా మీరు సదరు వార్తల్ని ధ్రువీకరించుకోవచ్చు’ అని నయన్‌ టీమ్‌ పేర్కొంది.

ప్రస్తుతం నయన్‌ చేతిలో ‘నేత్రికన్’, ‘కాతువక్కుల రెండు కాదల్‌’, ‘అన్నాత్తె’ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇటీవల ‘అన్నాత్తె’ టీమ్‌లో నలుగురు సభ్యులు కరోనా బారినపడడంతో.. ఆ సినిమా షూటింగ్‌ను కొంతకాలం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి

ఒకే ఒక్క విజయం

రామోజీరావు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు: మయూరిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని