ప్రియుడి బర్త్‌డే.. లక్షల్లో నయన్‌ ఖర్చు..! - Nayanthara spends THIS whopping amount on her Goa trip
close
Updated : 27/09/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియుడి బర్త్‌డే.. లక్షల్లో నయన్‌ ఖర్చు..!

ఖరీదైన గోవా ట్రిప్‌   

చెన్నై: తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ పుట్టినరోజును ప్రతీ ఏడాది విదేశాల్లో నిర్వహిస్తుంటారు నటి నయనతార. అయితే కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది నయన్‌.. విఘ్నేశ్‌ పుట్టినరోజును గోవాలో వేడుకగా జరిపించారు. వీరిద్దరూ కొన్నిరోజులపాటు గోవాలో సరదాగా గడిపారు. టూర్‌కి సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. టూర్‌ పూర్తి చేసుకుని ఇటీవలే వీరిద్దరూ ఓ ప్రైవేట్‌ చార్టర్‌లో చెన్నైకి తిరిగివచ్చారు. ఈ టూర్‌ కోసం నయన్‌ అక్షరాలా రూ.25 లక్షలు ఖర్చు చేశారని.. పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రియుడి పుట్టినరోజు కోసం నయన్‌ ఇంత ఖర్చుపెట్టారా అని తెలిసి అందరూ షాక్‌ అవుతున్నారు. ‘గోవా టూర్‌ బాగా ఖరీదు’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. 

2015లో తెరకెక్కిన ‘నేనూ రౌడీనే’ సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌కి విఘ్నేశ్‌ శివన్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘దర్బార్‌’ చిత్రం తర్వాత నయన్‌ ‘నెట్రికారన్‌’, ‘కాతువక్కుల రెండు కాదల్‌’, ‘ముక్తి అమ్మన్‌’ చిత్రాల్లో నటించనున్నారు. నయన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కనున్న ‘నెట్రికారన్‌’ చిత్రానికి విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే ‘కాతువక్కుల రెండు కాదల్‌’ చిత్రానికి విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నయన్‌, సమంత, విజయ్‌ సేతుపతి కీలకపాత్రలు పోషించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని