4లక్షల నకిలీ కరోనా టెస్టు కిట్ల పట్టివేత  - Nearly 4 Lakh Fake COVID 19 Test Kits Seized In Noida
close
Published : 30/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4లక్షల నకిలీ కరోనా టెస్టు కిట్ల పట్టివేత 

నొయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో 4లక్షల కరోనా టెస్టు నకిలీ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేస్తున్న రాజేశ్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని దిల్లీలోని అశోక్‌నగర్‌లోని అతడి నివాసంలో అరెస్టు చేశారు. తమ కంపెనీ పేరుతో కొందరు నకిలీ లేబుళ్లు, కరోనా కిట్లను తయారు చేసి మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని అసలు కంపెనీ ప్రతినిధి సోమవారం ఫిర్యాదు చేశారని సెక్టార్‌ 20 పోలీసులు తెలిపారు. దీంతో సోదాలు చేపట్టి సెక్టార్‌ 7 ప్రాంతంలో రహస్యంగా నకిలీ కరోనా కిట్లను తయారు చేస్తున్న కంపెనీని గుర్తించామన్నారు. దాదాపు 3.97లక్షల నకిలీ యాంటీబాడీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తయారీదారుపై కేసులు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని