నీతూ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌.. ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లికేనా? - Neetu kapoor Dance Practice Video Viral In Social Media Fans Asks About Ranbir Wedding
close
Published : 11/10/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీతూ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌.. ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లికేనా?

వైరల్‌గా మారిన వీడియో

ముంబయి: నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ల వివాహం గురించి తాజాగా మరోసారి ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాదిలోనే ఏడడుగులు వేయనున్నారని చాలా కాలం నుంచి విపరీతంగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా నీతూకపూర్‌(రణ్‌బీర్ తల్లి)కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో కనిపించడంతో ఆలియా-రణ్‌బీర్ పెళ్లి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది.

‘యే జవానీ హై దీవానీ’ చిత్రంలోని ‘గాగ్రా’ పాటకు నీతూకపూర్‌ డ్యాన్స్‌ చేస్తున్న ఓ వీడియోను ప్రముఖ కొరియో గ్రాఫర్‌ రాజేంద్ర సింగ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. ‘నేను ఎంతగానో అభిమానించే నీతూ మేడమ్‌తో డ్యాన్స్‌‌ చేయడం ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే రాజేంద్ర సింగ్‌ షేర్‌ చేసిన వీడియో పట్ల నెటిజన్ల నుంచి ఎన్నో స్పందనలు వస్తున్నాయి. ఆమె డ్యాన్స్‌ను ప్రశంసిస్తూ కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు. అంతేకాకుండా రణ్‌బీర్‌-ఆలియా పెళ్లి సమయం దగ్గర పడిందా? అందుకే డ్యాన్స్‌ నేర్చుకుంటున్నారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో రణ్‌బీర్‌-ఆలియా వెడ్డింగ్‌ గురించి మరోసారి బీటౌన్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వీడియో కొత్తదా లేదా పాతదా అనే దానిపై స్పష్టత లేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని