నయన్‌ నటనకు నిదర్శనం ఈ వీడియో..! - Netrikann Trailer Out Now
close
Updated : 18/11/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయన్‌ నటనకు నిదర్శనం ఈ వీడియో..!

చెన్నై: విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తన నటనతో ఎంతోమంది ప్రశంసలు అందుకున్న అగ్రకథానాయిక నయనతార మరోసారి తన నటనతో ఫిదా చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నేత్రికన్‌‌’. మిలింద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె అంధురాలిగా కనిపించనున్నారు. నయన్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం చిత్రబృందం ‘నేత్రికన్‌‌’ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

‘ఒకానొక సమయంలో ఓ ఊర్లో అమాయకపు గొర్రె పిల్లలు ఉండేవి. ఆ విషయం తెలుసుకున్న ఓ గుంట నక్క వాటిని క్రూరంగా వేటాడడం ప్రారంభించింది. అప్పుడు ఓ ధైర్యమున్న గొర్రె.. నక్క కోసం ఓ వ్యూహం రచించి దాని రాక కోసం వేచి చూసింది. అలా ఆ నక్క.. గొర్రె వేసిన వ్యూహంలో చిక్కుకుంది’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌లో ప్రతి సన్నివేశంలో నయన్‌ ఆకట్టుకునేలా నటించారు. ‘నీ కళ్లు ఏమీ చూడలేవు. కానీ నేను మాత్రం నిన్నే చూస్తున్నాను’ అని ప్రతినాయకుడు చెప్పిన డైలాగ్‌ మెప్పించేలా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని