12 వేల మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా - New Cases of 303 and 1 Death in Maharashtra Police Force in 24 Hours
close
Published : 17/08/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12 వేల మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కాలంలో ఉత్తమ సేవలందిస్తున్న పోలీసులు సైతం మహమ్మారికి బలవుతున్నారు. ఇప్పటివరకు 12,290 మంది మహారాష్ట్ర పోలీసులకు కొవిడ్‌ సోకగా 125 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లోనే 303 కేసులు నమోదవడం గమనార్హం. ఒకరు మృతిచెందారు. 9,850 మంది పోలీసులు వైరస్‌ బారినుంచి కోలుకోగా 2,315 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. 

దేశంలో కేసుల పరంపర కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,490 కేసులు నమోదయ్యాయి. 944 మంది రోగులు మృతిచెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తంగా 25,89,682 కేసులు నమోదవగా, 6,77,444 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 18,62,258 మంది కోలుకున్నారు. 49,980 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 50 వేలకు చేరువవుతోంది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని