కొత్తజంట.. వెండితెరపై సందడంట - New Movies And New Combinations In Tollywood
close
Published : 22/09/2020 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తజంట.. వెండితెరపై సందడంట

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ సినిమా విజయం సాధించాలంటే కథ ఎంత ముఖ్యమో అందులో నటించే పాత్రలు అంతే ముఖ్యం. ఏదైనా సినిమా పట్టాలెక్కుతుందంటే అందులో హీరో, హీరోయిన్‌ ఎవరా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. అందుకే దర్శక-నిర్మాతలు కూడా ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. హిట్‌ పెయిర్‌ అయితే, ఇండస్ట్రీలో అదో సెంటిమెంట్‌. మరి కొత్త కాంబినేషన్‌ అయితే వెండితెరపై ఆ జోడీ ఎలా మెప్పిస్తుందా? అని అందరూ ఎదురు చూస్తుంటారు. అలా టాలీవుడ్‌లో తొలిసారి తెర పంచుకోబోతున్న నాయకనాయికలపై ఓ లుక్కేయండి..!

రామరాజుకు సీతగా..

రామ్‌చరణ్‌ కీలక పాత్రలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వీరిద్దరూ మొదటిసారి కలిసి పనిచేయనున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, సీతగా ఆలియాభట్‌ మెప్పించనున్నారు.

భీమ్‌ కోసం.. హాలీవుడ్‌ భామ..

న్టీఆర్‌ సరసన మొదటిసారి ఓ హాలీవుడ్‌ భామ సందడి చేయనుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‌’లో కొమరం భీమ్‌ పాత్రలో తారక్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలీవియా మోరీస్‌ నటించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని ఓలీవియా వెల్లడించిన విషయం తెలిసిందే. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వీరి కెమెస్ట్రీ ఎలా వర్కవుట్‌ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

‘సర్కారు వారి పాట’ కీర్తి ఆట..!

హేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. అందంతోనే కాదు, అభినయంతోనూ అందరితోనూ శభాష్‌ అనిపించుకుంది కీర్తి.. మరి తాజా చిత్రంలో మహేశ్‌బాబుతో కలిసి ‘మహానటి’ నటిస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వింటేజ్‌ ప్రేమ పక్షులు

ప్రభాస్‌ కథానాయకుడిగా కె.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ ప్రేమకథగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే ఆడిపాడనున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో కనిపించిన ప్రభాస్‌-పూజా హెగ్డే జంటకు అభిమానులు ఫిదా అయిపోయారు. మరోవైపు ప్రభాస్‌ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెతో సైతం తెర పంచుకోనున్నారు. వీరిద్దరూ జంటగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కే భారీ బడ్జెట్‌ చిత్రంలో సందడి చేయనున్నారు.

పుష్పరాజ్‌కు జోడీగా

ల్లు అర్జున్‌ హీరోగా రష్మిక కథానాయికగా రానున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. బన్ని ఇందులో ఎర్రచందనం స్మగ్లర్‌గా, రష్మిక ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారని టాక్‌. ఇప్పటికే విడుదలైన పుష్ప ఫస్ట్‌లుక్‌లో బన్నీ రఫ్‌+మాస్‌ లుక్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి తెరపై బన్నీ-రష్మిక కాంబినేషన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

నారప్ప సరసన

వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అసురన్‌’కు రీమేక్‌గా ‘నారప్ప’ సిద్ధమవుతోంది. ఇందులో వెంకటేశ్‌ సతీమణిగా ప్రియమణి కనిపించనున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో, హీరోయిన్స్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు విడుదలైన ప్రేక్షకులను అలరించాయి.

‘ఫైటర్‌’కు పోటీగా..

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, ‘ఇస్మార్ట్‌’ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో బాలీవుడ్‌ భామ అనన్యాపాండే సందడి చేయనున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా విడుదల కానున్న ఈ సినిమాకి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ నెటిజన్లను ఆకర్షించాయి. విజయ్‌-అనన్య జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు కూడా పెట్టారు.

క్యూట్‌ ‘లవ్‌స్టోరీ’తో కలిశారిద్దరూ!

నాగచైతన్య, ఫీల్‌ గుడ్‌ చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల కలిసి క్రియేట్‌ చేయనున్న మేజిక్‌ ‘లవ్‌స్టోరీ’. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సాయిపల్లవి-చై మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఏ పిల్లా’ అనే సాంగ్‌ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రబృందం విడుదల చేసిన స్పెషల్‌ గ్లిమ్స్‌లో చై-సాయిపల్లవి జంటను చూసి సమంత సైతం ప్రశంసలు కురిపించింది.

బ్యాచ్‌లర్‌ బాబుకు జోడీగా..

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ కోసం అఖిల్‌-పూజాహెగ్డే, ‘సోలో బ్రతుకే సోబెటర్‌’ చిత్రం కోసం నభా నటేశ్‌-సాయిధరమ్‌ తేజ్‌, ‘సీటిమార్‌’లో గోపీచంద్‌-తమన్నా, ‘రెడ్‌’లో రామ్‌-మాళవిక శర్శ, ‘చావు కబురు చల్లగా’లో కార్తికేయ, లావణ్య త్రిపాఠిల జోడీ మొదటిసారి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని