నిహారిక-చైతన్య: కొత్తజంట కొత్త ఫొటోలు - New Photos From Nischay Celebrations
close
Published : 10/12/2020 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక-చైతన్య: కొత్తజంట కొత్త ఫొటోలు

మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటోన్న ఉపాసన

హైదరాబాద్‌: నిహారిక కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ.. వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. గత మూడు రోజులుగా పెళ్లి వేడుకల్లో బిజీగా గడిపిన ఈ జంట తాజాగా ఉదయ్‌విలాస్‌లోని అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం చైతన్య-నిహారిక ఉదయ్‌విలాస్‌ పరిసరాల్లో సరదాగా ఫొటోలు దిగారు. ఈ కొత్త జంట ఫొటోషూట్‌కు సంబంధించిన ఓ చిత్రం ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందులో నూతన వధూవరులిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అంతేకాకుండా వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు సైతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ముహూర్తం సమయంలో రామ్‌చరణ్‌-ఉపాసన నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నట్లు సదరు ఫొటోల్లో చూడొచ్చు. అదే చిత్రాల్లో రామ్‌చరణ్‌ వెనుక చిరంజీవి, పవన్‌ కూడా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

కాగా, నిహారిక పెళ్లి వేడుక తమకి ఎంతో సంతోషాన్ని అందించిందని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాపన తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా తన భర్తతో దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ‘చాలాకాలం తర్వాత మేమంతా ఎంతో సంతోషంగా గడిపాం. కంగ్రాట్స్‌ నిహారిక-చైతన్య. మీరిద్దరూ కచ్చితంగా మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. వరుణ్‌, నాగబాబు మామయ్య, పద్మ అత్తయ్య.. మీరు అందించిన ఆతిథ్యం గొప్పగా ఉంది. పెళ్లి వేడుక ఎంతో అద్భుతంగా జరిగింది’ అని ఉపాసన పేర్కొన్నారు.

తన సతీమణి పద్మను ఉద్దేశిస్తూ నాగబాబు తాజాగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఏ తండ్రికైనా కూతురు పెళ్లి చేయడం ఓ పెద్ద పని. ఉన్నదానిలోనే గొప్పగా తన కుమార్తె వివాహం చేయాలని ప్రతి తండ్రి భావిస్తుంటాడు. నేనూ దానికి మినహాయింపు కాదు. మీరు ఇప్పుడు కళ్లతో చూస్తున్న దాని వెనుక ఎంతో ప్లానింగ్‌, కష్టం, అన్నింటినీ మించి కంగారు. నా సతీమణి పద్మ నాతోపాటే ఉంటూ వేడుక నిర్వహణ భారాన్ని తన భుజాలపై వేసుకుని పెళ్లి సంబరాలు సంతోషంగా జరిగేలా చేసింది’ అని తెలిపారు.

ఇవీ చదవండి

కొణిదెల-అల్లు సకుటుంబ సపరివార సమేతంగా..!

తలంబ్రాల వేడుక.. నిశ్చయ్‌ ఇలా..!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని