ఎన్టీఆర్‌ సరసన కియారా అడ్వాణీ? - New Rumor About NTR30
close
Published : 27/11/2020 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ సరసన కియారా అడ్వాణీ?

రష్మిక ఉండనట్లేనా..?

హైదరాబాద్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. తారక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ రానున్న రెండో చిత్రం కావడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, తారక్‌ సరసన కథానాయికగా ఎవరు సందడి చేయనున్నారనే విషయంలో కొంతకాలంగా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో తారక్‌ సరసన రష్మిక ఆడి పాడనుందంటూ మొదట్లో ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ నటి కియారా ఆడ్వాణీ పేరు కూడా వినిపిస్తోంది.

విభిన్న కథాచిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్‌ సరసన కియారా ఆడ్వాణీ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావించారట. ఈ మేరకు సంప్రదింపులు చేయగా.. ఆమె కూడా సముఖత వ్యక్తం చేసినట్లు వరుస కథనాలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్‌-కియారా జోడీ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రష్మిక ఉండనట్లేనా అని మరికొంతమంది అంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని