రఫాడించిన పూరన్‌.. పంజాబ్‌కు ఎలా ఆడతాడో? - Nicholas Pooran 45 balls 100 runs third fastest century in CPL
close
Published : 31/08/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఫాడించిన పూరన్‌.. పంజాబ్‌కు ఎలా ఆడతాడో?

సీపీఎల్‌ చరిత్రలో మూడో వేగవంతమైన శతకం

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ ఆదివారం రాత్రి రఫాడించాడు. అక్కడ జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వరుసగా మూడు సిక్సులు సంధించి ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. కేవలం 45 బంతుల్లోనే వంద పరుగులు చేసి టోర్నీ చరిత్రలో మూడో వేగవంతమైన శతకం బాదాడు. సెంట్‌ కిట్స్‌తో ఆదివారం తలపడిన మ్యాచ్‌లో గుయానా అమెజాన్‌ వారియర్స్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాస్‌టేలర్‌(25; 27 బంతుల్లో 1x6)తో జోడీ కట్టిన నికోలస్‌ పూరన్‌(100; 45 బంతుల్లో 4x4, 6x10) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

చివర్లో వరుసగా మూడు బంతులను బౌండరీ దాటించి శతకం పూర్తి చేసుకున్నాడు. అలా వారిద్దరు చివరి వరకు క్రీజులో నిలబడి 128 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో గుయానా వారియర్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇదిలా ఉండగా, పూరన్‌ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోవడంతో ఇప్పుడు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఈ విండీస్‌ క్రికెటర్‌ ఆ జట్టుతోనే ఆడనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ అతడు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు పంజాబ్‌ జట్టు కూడా ఆదివారం అర్ధరాత్రి పూరన్‌ శతకం బాదిన వీడియోను రీట్వీట్‌ చేసింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని