ఆన్‌లైన్‌లో చై-నిహారిక పార్టీ ఫొటోలు - Niharika Chaitanya Party Photos Goes Viral On Online
close
Published : 15/11/2020 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌లో చై-నిహారిక పార్టీ ఫొటోలు

హైదరాబాద్‌: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల డిసెంబర్‌ నెలలో తన సింగిల్‌ లైఫ్‌కి గుడ్‌ బై చెప్పనున్నారు. చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేయనున్నారు. దీంతో ఇప్పటికే మెగా కుటుంబంలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక.. అక్టోబర్‌ నెలలో తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్‌ పార్టీ జరుపుకున్నారు. అయితే ఈ పార్టీలో నిహారికతోపాటు ఆమెకు కాబోయే భర్త చైతన్య కూడా పాల్గొన్నారు. ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను నిహారిక స్నేహితులు అప్పట్లో షేర్‌ చేశారు కూడా. అయితే తాజాగా నిహారిక-చైతన్య ఉన్న పార్టీ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. వాటిని చూస్తే.. బ్యాచిలరేట్‌ పార్టీకి సంబంధించినవిగానే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. నిహారిక-చైతన్యలకు ‘ఆల్‌ ది బెస్ట్’‌  చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోలు గోవా పార్టీవేనా అనుకుంటున్నారు.

కాగా, తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగబాబు నివాసంలో జరిగిన వేడుకల్లో నిహారికకు కాబోయే భర్త చైతన్య  పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఇంటి ఆవరణలో నిహారిక వేసిన రంగోలీని వరుణ్‌ తేజ్‌ ప్రశంసించారు. అనంతరం తన చెల్లి-బావలతో కలిసి వరుణ్‌ ఫొటోలకు పోజులిచ్చారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని