
తాజా వార్తలు
నిఖిల్‌కు జోడీగా అను?
హైదరాబాద్: ‘మజ్ను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నా సరైన విజయాలు ఆమె తలుపు తట్టలేదు. 2018లో ఆమె నాలుగు సినిమాల్లో నటించగా, ఏ చిత్రమూ బ్రేక్నివ్వలేకపోయింది. అను చివరిగా నాగచైతన్యతో కలిసి ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరో తెలుగు చిత్రం చేయలేదు. త్వరలో మళ్లీ ఓ చిత్రంతో తెలుగు తెరపై మెరవబోతునట్లు సమాచారం.
యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా ‘18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. సుకుమార్ కథ, స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో నాయికగా కృతిశెట్టిని ఎంపిక చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ స్థానంలో అను ఇమ్మాన్యుయేల్ పేరు వినిపిస్తోంది. ఈ కథ, పాత్రకు అను అయితే సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోందట. ప్రస్తుతం అనుతో చర్చలు సాగుతున్నాయని సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
- భలే పంత్ రోజు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
