రియాకు బెయిల్‌.. 9 షరతులివే..! - Nine Bail Conditions For Rhea
close
Updated : 07/10/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియాకు బెయిల్‌.. 9 షరతులివే..!

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ ఆరోపణలపై అరెస్టైన రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. గత నెలలో ఎన్సీబీ అధికారులు రియాను అరెస్టుచేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే, పలుమార్లు ఆమె బెయిల్‌ పిటిషన్లు‌ పెట్టుకున్నా తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా ఆమెకు బాంబే హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి మాత్రం నిరాశే ఎదురైంది. నటి రియా చక్రవర్తికి బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు తొమ్మిది షరతులు విధించింది. 

ఆ షరతులివే..   

* పాస్‌పోర్టు డిపాజిట్‌ చేయాలి

* పది రోజులకొకసారి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో  రిపోర్టు చేయాలి.

* పూచీకత్తు కింద రూ.1లక్ష చెల్లించాలి

* దేశాన్ని విడిచి వెళ్లరాదు

* ఈ కేసులో సాక్షులను కలవకూడదు.  

* గ్రేటర్‌ ముంబయిని దాటి వెళ్లాల్సి వస్తే మాత్రం దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి. ప్రయాణానికి సంబంధించిన వివరాలను ముందుగానే అందజేయాలి.

* ప్రతి నెలలో తొలి సోమవారం దర్యాప్తు సంస్థ ఎదుట రిపోర్టు చేయాలి. ఇలా ఆరు మాసాలపాటు చేయాల్సి ఉంటుంది. 

* ఏదైనా సహేతుకమైన కారణం ఉంటే తప్ప అన్ని తేదీల్లోనూ కోర్టుకు హాజరు కావాలి.

* ఈ కేసులో దర్యాప్తు, సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని