11కి చేరిన రాయ్‌గఢ్‌ మృతుల సంఖ్య - Nine Dead Several Missing After Raigad Building Collapse
close
Updated : 25/08/2020 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

11కి చేరిన రాయ్‌గఢ్‌ మృతుల సంఖ్య

లభించని పలువురి ఆచూకీ

ముంబయి: రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 75 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోగా ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. మిగతావారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన మూడు బృందాలు, 12 అగ్ని మాపక శాఖ బృందాలు 22 గంటలుగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల కింద ఉన్నవారిని కనుగొనేందుకు జాగిలాల సహాయం తీసుకుంటున్నారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని