మంచి నటీమణులందరూ చాయ తక్కువున్నవారే! - Nireekshana Actress Archana About Her Colour
close
Updated : 16/11/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచి నటీమణులందరూ చాయ తక్కువున్నవారే!

అలనాటి నటి అర్చన

హైదరాబాద్‌: ‘ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది’ అంటూ భానుచందర్‌తో ఆడిపాడిన అలనాటి నటి అర్చన. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే సెలబ్రిటీ చాట్‌ షో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అర్చన పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు.

సీరియస్‌ ఫిల్మ్స్‌ చేయడం చాలా తేలికని.. కామెడీకి మాత్రం టైమింగ్‌ చాలా ముఖ్యమని.. హాస్యం పండించడం ఎంతో కష్టమని అర్చన ఒకప్పటి సంఘటనలను పంచుకొన్నారు. ‘ఒక తెల్లని అమ్మాయి మంచి నటి అయితే.. ఆమె మంచి నటి అంటారు అంతే. కానీ, రంగు తక్కువ అమ్మాయి కనుక స్ర్కీన్‌ ముందుకు వస్తే ఈ కెమెరామెన్లకు లడ్డూలు తింటున్నట్లు ఉంటుంది. అంత ఇష్టపడతారు. మంచి నటీమణులను చూస్తే.. వారంతా దాదాపు రంగు తక్కువ ఉన్న మహిళలే’ అంటూ తన కలర్‌, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు. అంతేకాకుండా.. కొత్త అమ్మాయి, సినిమాకి పనిరాదు.. ఇలాంటి కారణాల వల్ల తనని కొన్ని సినిమాలకు రిజక్ట్‌ చేశారని అర్చన నాటి రోజుల్ని గుర్తుచేసుకోనున్నారు. అలనాటి జాతీయ ఉత్తమ నటి అర్చన తెలియజేసిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ఎపిసోడ్‌ చూసేయాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని