నిశ్చయ్‌.. ఇవి చాలా ఖరీదు గురూ..! - Nischay Sneha Reddy And Upasana Accessories
close
Updated : 11/12/2020 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిశ్చయ్‌.. ఇవి చాలా ఖరీదు గురూ..!

ధర చూసి అవాక్కవుతున్న ఫ్యాషన్‌ ప్రియులు

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ‘నిశ్చయ్’‌ వేడుకలకు సంబంధించిన ఫొటోల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా సెర్చ్‌ చేశారు. పెళ్లి వేడుకలు ప్రారంభమైన నాటి నుంచి నిహారిక, పెళ్లికి హాజరైన ప్రముఖులు ధరించిన దుస్తులు, ఆభరణాలు చూసి ‘వావ్‌’ అంటూ కామెంట్లు చేశారు.

ఐదు రోజులపాటు జరిగిన నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల్లో స్నేహారెడ్డి, ఉపాసన, చిరంజీవి కుమార్తెలు ధరించిన కొన్ని డిజైనరీ దుస్తులు, బ్యాగ్‌లు ఇటు నెటిజన్లను, అటు ఫ్యాషన్‌ ప్రియుల్ని ఎంతో ఆకర్షించాయి. దీంతో కొంతమంది.. సదరు దుస్తుల ధర ఎంత ఉంటుందో తెలుసుకునే పనిలో పడ్డారు. వాటి ధరలు చూసి ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. వాటి ధరలు మీరూ ఓ సారి చూసేయండి..!


నిహారిక వివాహ వేడుక కోసం ఉదయ్‌పూర్‌కు పయనమైనప్పుడు తన సతీమణి స్నేహారెడ్డిని చూసి బన్నీ క్యూటీ అంటూ కామెంట్ చేశారు. బన్నీ షేర్‌ చేసిన ఫొటోలో స్నేహ.. బూడిద రంగు వెస్ట్రన్‌ స్టైల్‌ లాంగ్‌ ఫ్రాక్‌ ధరించారు. అనితా దొంగ్రే డిజైన్‌ చేసిన ఈ డ్రెస్‌ ధర దాదాపు రూ.12,900. అదే రోజు ఆమె ధరించిన దియోర్‌ (DIOR) శాడల్‌ బ్యాగ్‌ ధర రూ.2,47,620 ఉంటుందని అంచనా. మరోవైపు సంగీత్‌లో ఓ స్టైలిష్‌ డ్రెస్‌లో స్నేహారెడ్డి మెరిసిపోయారు. ఆ డ్రెస్‌ ధర రూ.4,35,000 ఉంటుందట. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అమిత్‌ అగర్వాల్‌ దాన్ని రూపొందించారు.


ఇక ఉపాసన కొణిదెల.. లైట్‌ పింక్‌ కలర్‌లో ఉండే సింపుల్‌ ఫ్రాక్‌లో మెరిశారు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాగ్‌ అందర్నీ ఆకర్షించింది. హెర్మస్‌ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్‌ ధర రూ.11,73,171 ఉంటుందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అలాగే సంగీత్‌లో తరుణ్ తహిలియానీ, పెళ్లి వేడుకల్లో మనీష్‌ మల్హోత్ర డిజైన్‌ చేసిన దుస్తుల్లో ఆమె ఆకట్టుకున్నారు. వీటి ధర కూడా లక్షల్లోనే ఉండొచ్చని ఫ్యాషన్‌ ప్రియులు మాట్లాడుకుంటున్నారు.


నిహారిక పెళ్లి వేడుకల్లో లావణ్యత్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. నిశ్చయ్‌ సంగీత్‌లో లావణ్య నీలిరంగు చీరలో మెరిసిపోయారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర డిజైన్‌ చేసిన ఈ చీర ధర రూ.1,35,000 ఉంటుందని నెట్టింట్లో టాక్‌.


నిహారిక-చైతన్యల వివాహం మరుసటి రోజు ఉదయ్‌విలాస్‌లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత క్రీమ్‌ కలర్‌లో ఉండే పువ్వుల చీర ధరించారు. చూడడానికి చాలా సింపుల్‌గా కనిపించినప్పటికీ సభ్యసాచి బ్రాండ్‌కు చెందిన ఈ చీర ధర రూ.85 వేలు..!!

నిహారిక-చైతన్యల పెళ్లి వేడుక ఫొటోగ్యాలరీ

ఇవీ చదవండి
కొణిదెల-అల్లు సకుటుంబ సపరివార సమేతంగా..!

నిహారిక-చైతన్య: కొత్త జంట, కొత్త ఫొటోలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని