నితిన్‌ చిత్రానికి ఆసక్తికర టైటిల్‌ - Nithiin and Chandra Sekhar Yeleti new movie pre look unveiled by koratala siva
close
Published : 01/10/2020 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌ చిత్రానికి ఆసక్తికర టైటిల్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నితిన్‌ జోరుమీదున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘రంగ్‌దే’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇక వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌-టైటిల్‌ను స్టార్‌ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘చెక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రీలుక్‌లో నితిన్‌ చేతికి సంకెళ్లు ఉండగా, టేబుల్‌పై చదరంగం పావులు, కంచె ఉన్నాయి. మరి ఈ చదరంగం ఆటలో ఎవరు ఎలాంటి పావులు కదిపారు? ఎవరు చెక్‌మేట్‌ చెప్పారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్‌ పెడతారో చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు రకుల్, ప్రియా వారియర్‌ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతరవిశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని