close

తాజా వార్తలు

‘పింక్‌’ రీమేక్‌లో నివేదా..?

హైదరాబాద్‌: బాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘పింక్‌’. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలకపాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే.  ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మించనున్నారు. ఈ రీమేక్‌కు శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించనున్నారు. ‘పింక్‌’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోషించనున్నట్లు నిర్మాత బోనీ కపూర్‌ తెలిపారు. అయితే ఈ రీమేక్‌లో మరో కీలకపాత్రలో నివేదా థామస్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘పింక్‌’ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నివేదా చేయనున్నారంటూ టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం నివేదాను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.