రహస్యం అప్పుడే తెలుస్తుంది - Nivetha Thomas special interview
close
Updated : 30/08/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రహస్యం అప్పుడే తెలుస్తుంది

‘ఓటీటీలకు భవిష్యత్తు ఉంది. ఇవి సినిమాలు తీసేవాళ్లకు మంచి వేదికలుగా మారుతాయి. కానీ థియేటర్లకు ప్రత్యామ్నాయమవుతాయని నేను అనుకోవడం లేదు’ అని అంటోంది కథానాయిక నివేదా థామస్‌. ప్రస్తుతం ఆమె ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అంతర్జాల వేదికల ద్వారా విలేకరులతో మాట్లాడింది. ఆ విశేషాలు ఇవి...

ఆశ్చర్యపోయేదాన్ని...

ఇందులో నా పాత్ర పేరు అపూర్వ. ఈ విషయాన్ని మేం చెప్పకముందు నుంచే చాలా మంది నన్ను అపూర్వ అని పిలిచేవారు. అది నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. వీళ్లకు నా పాత్ర పేరు ఎలా తెలిసిందని అనుకునేదాన్ని. ట్రైలర్‌లో సుధీర్‌కి అపూర్వ అని ఒక కాల్‌ వస్తుంది. దాన్ని వాళ్లు బాగా గమనించారు. అప్పుడే ప్రేక్షకులు ప్రతి దాన్ని చాలా    జాగ్రత్తగా చూస్తున్నారని తెలిసొచ్చింది. అపూర్వ ఒక క్రైం నవల రాయాలని అనుకుంటుంది. దీనికోసం ఆమె ఎంత దూరమైనా వెళ్లాలని అనుకుంటుంది. ఇది నాకిష్టమైన పాత్ర.

అదే ‘వి’...

‘వి’ అంటే ఏంటనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. ‘వి’ అంటే విజయం అని అనుకోవచ్చు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

అలాంటి పాత్రలు చేస్తా

ఆరు నెలల్లో ఎన్నో కథలు విన్నా. అవన్నీ తెలుగు కథలే. నేను విలన్‌గా చేయడానికి సిద్ధంగానే ఉన్నా. నెగెటివ్‌ పాత్ర అనేది చాలా విశాలమైంది. ప్రతినాయకుడు ఒకరిని కొట్టి విలనిజం చూపించుకోవాలని ఏమీ లేదు. మెదడు ద్వారా ఆలోచిస్తూ టాక్టికల్‌గానూ చేయొచ్చు. ప్రతికూల పాత్రలు వస్తే నేను తప్పకుండా చేస్తా.

అదే బాధిస్తుంది...

నేను ఎప్పుడూ నా చదువుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకుంటూ ఉంటా. ఈ లాక్‌డౌన్‌లో కథల గురించి చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చా. ఇన్ని రోజులు ఇంటిదగ్గర ఉండటం ఆనందంగా ఉంది. మా నాన్న దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటారు. ఆయన ఇంటికి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఆయన పదిహేడేళ్లలో ఇంటికి రాకుండా ఇంత పెద్ద బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదు. ఇది చాలా బాధిస్తుంటుంది.

నాని నా కుటుంబ సభ్యుడు..

ట్రైలర్‌ చూశాకా నాని పాత్ర గురించి ఎన్నో రకాలుగా ఊహించుకుంటున్నారు. ఆ పాత్ర ఎలా ఉన్నా... ఆయన వ్యక్తిగతంగా నాకో కుటుంబ సభ్యునిలా ఉంటారు. ‘జెంటిల్‌మెన్‌’కి ఇప్పటికీ మా అనుబంధంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చితే నేను దాన్ని నానితో పంచుకుంటా. కొత్త విషయాలు నేర్చుకుంటుంటా.

చాలా కష్టపడ్డాం...

సినిమాను థియేటర్లో విడుదల చేయాలనే మేమంతా కష్టపడ్డాం. ఏ సినిమా చేసినా దాన్ని ప్రేక్షకులే కదా చూసేది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇంటి బయట ఉండే దుకాణానికీ వెళ్లలేకపోతున్నాం. ఇక థియేటర్లు ఎప్పుడు తెరుచు    కుంటాయో స్పష్టత లేదు. అందుకే  చిత్రబృందం మొత్తం మాట్లాడుకునే.. ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌  చేయడానికి ఎంతో సమయం పట్టింది. ఎంతో కష్టపడి పనిచేశాం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని