కొత్తరకం కరోనాపై ఆందోళన వద్దు.. - No need to panic says union health minister on new variant of coronavirus
close
Published : 21/12/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తరకం కరోనాపై ఆందోళన వద్దు..

భారత్‌ అప్రమత్తంగా ఉందన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

దిల్లీ: బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మహమ్మారిపై భారత ప్రజలు చేసిన పోరాటం మనదేశ సహనశక్తికి నిదర్శనంగా నిలిచిందన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్‌ మెరుగైన పనితీరును కనబరిచిందని.. ఇదంతా మోదీ నాయకత్వం వల్లే సాధ్యమయిందని తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌-2020 ప్రారంభాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా ఏటా డిసెంబరు 22న ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.

మరోవైపు బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని విమానాల్ని వెంటనే రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరోవైపు కొత్త రకం వైరస్‌, దాని పుట్టుక, వ్యాప్తిపై చర్చించేందుకుగాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన పరిధిలోని సంయుక్త పర్యవేక్షణ బృందం (జేఎంజీ) భేటీని అత్యవసరంగా ఏర్పాటుచేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) అధ్యక్షతన సమావేశమైంది. 

నూతన రకం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ గుబులు పుట్టిస్తోంది. ఈ రకం వైరస్‌ అడ్డూ అదుపూ లేకుండా ప్రబలుతోందంటూ బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇటలీలోనూ కొత్త రకం వైరస్‌ సోకిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో నెదర్లాండ్స్‌, బెల్జియం తదితర ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. అలాగే ఐరోపా దేశాలతో పాటు సౌదీ అరేబియా, కెనడా సైతం బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.

ఇవీ చదవండి..

కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?

48 రోజులు కీలకంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని