ఎన్సీబీ విచారణలో దీపికతో రణ్‌వీర్‌‌..! - No request from Ranveer Singh to join Deepika Padukone during questioning by NCB
close
Published : 26/09/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్సీబీ విచారణలో దీపికతో రణ్‌వీర్‌‌..!

ఆ వార్తలు అవాస్తమన్న ఎన్సీబీ అధికారి

ముంబయి: మాదకద్రవ్యాల అంశం ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ఇప్పటికే బీటౌన్‌కి చెందిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్లతోపాటు దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో రకుల్‌‌, దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. అయితే తన సతీమణి దీపికకు మానసికంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, శనివారం జరగబోయే ఎన్సీబీ విచారణ సమయంలో తాను కూడా దీపికతోనే ఉంటానని రణ్‌వీర్‌ సింగ్‌ అధికారులను కోరినట్లు పలు జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీటిపై ఓ ఎన్సీబీ అధికారి తాజాగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తమని తెలిపారు. ‘సమన్లు అందుకున్న దీపిక నుంచి కానీ, ఆమె కుటుంబం నుంచి కానీ అలాంటి అభ్యర్థన మాకు రాలేదు. విచారణకు హాజరవుతానని తెలియజేస్తూ ఆమె మాకు ఓ ఈ-మెయిల్‌ మాత్రమే పంపించారు’ అని ఎన్సీబీ అధికారి వెల్లడించారు.

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సుశాంత్‌ సింగ్‌ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌తోపాటు డ్రగ్స్‌ సరఫరా, అమ్మకాలు చేసే పలువురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంతోపాటు విచారణలో భాగంగా సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వెల్లడించిన వివరాలను, ఆమె వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని దీపిక, ఆమె మేనేజర్‌, సారా, శ్రద్ధా, రకుల్‌కు అధికారులు సమన్లు జారీ చేశారు. ఈమేరకు సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, దీపికా పదుకొణె... శనివారం ఉదయం ఎన్సీబీ ఎదుట హాజరు కానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని