ఈ లెహంగా ధర అక్షరాలా రెండు లక్షలు - Nora Fatehi Is Magnificient In Tarun Tahiliani’s Lehenga Which Costs Around 2 lakhs
close
Updated : 16/11/2020 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ లెహంగా ధర అక్షరాలా రెండు లక్షలు

ఫొటోలు షేర్‌ చేసిన ‘బాహుబలి’ డ్యాన్సర్‌

ముంబయి‌: పండుగల సమయాల్లో సెలబ్రిటీలందరూ డిజైనరీ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. నటీనటులు వేసుకున్న దుస్తులకు ఫిదా కావడంతోపాటు వాటి ధరలు తెలుసుకోవాలనుకోవడానికి తరచూ ఫ్యాషన్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా దీపావళి వేడుకల్లో భాగంగా ఓ బాలీవుడ్‌ నటి ధరించిన లెహంగా ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో ఆడిపాడిన కెనడా‌ ముద్దుగుమ్మ నోరా ఫతేహి. చురకత్తులాంటి ఆమె చూపులకు తెలుగు కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న నోరా ఫతేహి ఇటీవల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. నెటిజన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది.

తరుణ్‌ తహిల్యాని డిజైన్‌ చేసిన బంగారు వర్ణపు దుస్తులను ఫొటోషూట్‌ కోసం నోరా ధరించారు. దివ్వెల కాంతుల మధ్య బంగారు వర్ణ దుస్తుల్లో ఆమె మరింత మెరిసిపోయారు. దీంతో ఈ ఫొటోలు ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షించాయి. మరోవైపు నోరా ధరించిన లెహంగా ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని ఫ్యాషన్‌ ప్రియులు ఆసక్తి చూపారు. సదరు డిజైనర్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో చెక్‌ చేసి.. లెహంగా ధర తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే దాని ధర రూ.1,99,900. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని