రతన్‌టాటా బయోపిక్‌పై మాధవన్‌ క్లారిటీ - Not Playing Ratan Tata says Madhavan
close
Published : 13/12/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రతన్‌టాటా బయోపిక్‌పై మాధవన్‌ క్లారిటీ

చెన్నై: అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైనా రతన్‌టాటా ‘బయోపిక్‌’పై గత కొంతకాలంగా సినీవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’తో భారీ సాధించిన డైరెక్టర్‌ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వినిపించాయి. అందులో మాధవన్‌ ‘రతన్‌టాటా’గా కనిపించనున్నారని.. ఈ సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారని సోషల్‌ మీడియాలోనూ పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఈ వార్తలపై స్పందించాడీ సఖీ హీరో.

‘మాధవన్‌.. మీరు రతన్‌ టాటా బయోపిక్‌ సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్నారట. ఇది నిజమేనా.? ఒకవేళ ఈ వార్త నిజమైతే ఎంతమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ఓ అభిమాని పోస్టు చేశాడు. దానికి ఓ పోస్టర్‌ను కూడా జత చేశాడు. అందులో మాధవన్‌ అచ్చం రతన్‌టాటాలా కనిపిస్తున్నాడు. అయితే.. ఈ పోస్టర్‌పై మాధవన్‌ స్పందించారు. ‘దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానుల కోరిక మాత్రమే. ఇంతవరకూ అలాంటి ప్రాజెక్టు గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు’ అని మాధవన్‌ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా.. సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’తో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్‌ సుధా కొంగర తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

అనుష్క ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన ‘నిశ్శబ్దం’లో మాధవన్‌ కీలకపాత్రలో నటించారు. అయితే.. అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. మాధవన్‌ నటించిన ‘మారా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 17న ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి...

క్షమాపణలు చెప్పిన నటుడు మాధవన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని